శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయి మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయి మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ
జల జల జల జాజుల వాన కిలకిలకిలా కిన్నెర వీణ
మిలమిలమిన్నంచుల పైన మెలి తిరిగిన చంచలయాన
మధురోహల లాహిరిలోన మదినుపే మదిరవే జానా
నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైనా నీ వెనకలేమౌతున్న
నీ వీపుని ముల్లై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు
లలన తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకినా వారు గాలిబ్ గజలైపోతారు
నీ వేలే తాకినా వారు నిలువెల్లా వీనవుతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగామ్మ
నక్షత్రాలేన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నావెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వేలి వేయోద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టూ
అందాకా మారం మని జోకొట్టావే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుగ్గానీ
నళినీవో హారిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మ