నాలో ప్రేమే కన్నులోన
కాలే అయితే కన్నీరంతా
కానరాక దాచవే మనసా
నది కడలి వీడే కథే ఇది తెలుసా
ప్రేమలోన తీయని తేనె
కురిసిన వానై తానే
తడిపిన నిలువునా నన్నే
చెలి చెలిమి కోసం ఈ చిరు ఆశ
నాలో ప్రేమే కన్నులోన
కాలే అయితే కన్నీరంతా
కానరాక దాచవే మనసా
నది కడలి వీడే కథే ఇది తెలుసా
అద్దమంటి హృదయమందు
నీ బింబం కదలాడెనె
నీ బింబం కదలాడెనె
నిండు చంద్రుడు కొలనులోన
కలువ చంతన తెలివున్న
ఇలకు జారీ జతగా మారేనా
కొలను వీడి కలువ చేరేనా
మన దారులు వేరై
నా గమ్యం నీవై ఎటువైపు వెళ్ళనో
తెలియని తీరై నా మనసే వేరై
జారెను నన్నే వీడి ఈనాడే
ప్రేమ మనిషికి భారమైన
మనసు మనసు కు దూరమెంత
ఎక్కడ ఉన్న వీడను నీ చెంత
గాలి మెడను గాలి లోనే
నీటి రాతలు నీటి లోనే
కలిసి పోయే కనులు విన్నాలే
కడకు నా కథలో జరిగేనా
చిగురాకులోన దాగున్న కొమ్మ
కోకిల వేదన వింటుందా
నీ గుండెల్లోనా ఆవిరైపోయే
కన్నీరై కారింది నేడే