చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్ళోకెళ్ళే వేళ రెండు జల్లు అంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం
కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నాకోసం నువ్ పడే కష్టం
తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం
గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం
రెప్పల తలుపు మూసి కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే కొత్త కబురులంటే ఇష్టం
ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం