హూ ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసుమీద
హే ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసుమీద
ఎగరనివ్వలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసుమీద
ఎగరనివ్వలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తపు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరుగా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటె ఏంటిరా
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసుమీద
ఎగరనివ్వలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసుమీద
ఎగరనివ్వలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
సూర్యుడైనా చూపగలడా రెయిచాటున్న రేపుని
చీకటైనా ఆపగలడా వచ్చేకలల్ని వద్దనీ
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ
అన్నో అందాలు స్వాగతిస్తూ కళ్లముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటేఎలా
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసుమీద
ముసుగు వెయ్యద్దు వలలు వెయ్యద్దు
ఎగరనివ్వలి తుఫాను వేగాలతో
కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా
కోటలైనా కొంపలైనా ఏవీ స్ధిరాస్ధి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదురా
నిన్న లేవైనా గురుతుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ
నీవెవరో నేనెవరో ఓ క్షణాన కలసి నడుద్దాం
సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం