ఏ కథ ఎటు పరిగెడుతుందో
ఏ అడుగేటు తడబడుతుందో
ఏ మలుపేటుగా నెడుతుందో తెలీదే
ఏ క్షణమెప్పుడేం చేస్తుందో
ఎవరినెలా నిలబెడుతుందో
ఎవరినెలా పడగోడుతుందో తెలీదే
మెరిసే కళలు తడిసాయి ఎందుకో విరిసే లోపుగా
ఎగసే అలలు విరిగాయి దేనికో తలవని తలపుగా
స్వరమ్ లో ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు ఎంతో కొంత
చందమామ అందలేదని
తగని దిగులు చెందగలమా
వెన్నెలుంది చాలులెమ్మని
వెలుగు పడిన కలగా పయనించలేమా
బంధమెంత బలమైనా
బాధలేని సమయానా
దాని విలువ తెలిసినా
చిగురు వగరు వివరాలు సులువుగా తెలియని వయసులో
పగలు రేయి తేడాలు పోల్చని మసకల మలుపులో
స్వరమ్ లో ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు ఎంతో కొంత
ముందుగానే తెలియదుగా
అసలు సిసలు బ్రతుకు నడక
సమయము కదలదుగా
అప్పుడో ఇప్పుడో కలత కనుపానంటకా
అనుభవాలు ప్రతిపాఠం
జరిగినాకే కనుగొంటాం
సరే కానీ అనుకుంటాం హాఆఆ
ఎటుగా వెళితే ఎం దొరుకుతుందని తెలుపని జీవితం
తనతోపాటు తలవంచి కదిలితే పంచదా అమృతం
స్వరమ్ లో ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు ఎంతోకొంత