సగమై చెరి సగమై
ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా
అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెలి తిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితె
ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి
నీకే కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా
నీతో బ్రతకాలనీ
సగమై చెరి సగమై
ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా
అడుగేస్తున్నాను
నీతో ఉంటె కలికాలమే
చంపుతోంది చలికాలమై
వెచ్చనైన చలిమంటే నీ ఊపిరంటా
జారేటి జలపాతాల వీధిలో
జంట స్నానాలు చేద్దామా
స్వర్గాల దుర్గాల కోటలే
మరి పరిపాలిద్దామా
మరుజన్మలలో కాలాన్నే దోచేసెయ్ నా
ఈ జన్మే అందించనా
తాలలేని విరహాలతో
ఊపిరాగిపోదా మరి
రెప్పపాటు సమయం
నువు నన్నే వీడావో
రంగుల మల్లెలు జల్లేనే
హరివిల్లులు మనకోసం
వెన్నెల పందిరి అల్లెనే
రాతిరేళల ఆకాశం
కలగనడం ఆలస్యం నిజమైపోతుందే
ఈ భాగ్యం మనదేనా
సగమై చెరి సగమై
ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా
అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
విరి ముద్దుల యుద్ధం
మెలితిప్పిన మీసం
నా నడుమంచున మడతెంచితె
ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి
నీకే కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా
నీతో బ్రతకాలనీ