కలలు నావేన
కధలు నావేన
నీకు చేరింది శ్యూన్యమా
తపన నాదేనా
తలపు నాదేనా
నీకు నా ఊహే దూరమా
కనులతో నే తెలిపిన
నా ప్రేమ నిను తాక లేదా
మనసుతో నే పలికిన
రాగాలు వినిపించనే లేదా
మనసు నాదేనా
మమతా నాదేనా
నీకు నేనైతే దూరమా
పిలుపు నాదేనా
బదులు నాదేనా
చలనేమే లేని శిల్పమేనా
నీవు పలికిన వేల పదములు
ప్రేమ పిలుపులు కావని
నాతో నడిచిన వేల అడుగులు
సాగు గమనము వేరని
నవ్వుతూ నను చూసిన
చూపుల కథ వేరని
నేడు నీ చిరునవ్వుతో
తెలిసింది అంతా శూన్యమేనని
నిన్ను చూసిన నాటి క్షణమున
నా యదె నను వీడలే
నేడు నువ్వు లేవన్న మది నిను
వీడి రాలేనందిలే
నీవు నన్నలా చేరితే
జగమే మరిచానే
నేను నీ కలలోకి చేరే
దారి ఎదో తెలియలేదే
కలలు నావేన
కధలు నావేన
నీకు చేరింది శ్యూన్యమా
తపన నాదేనా
తలపు నాదేనా
నీకు నా ఊహే దూరమా
కడలిలా ఉప్పొంగిన
గుండెల్లో నీ పైన ప్రేమా
కడకిలా నీ మనసులో
చినుకంటా కలిగించనేలేదాఅ