శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి
దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ
బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి
దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ
ధడక ధడక ధడక దీని మాయదారి నడక
ఉలికి ఉలికి పడకే చిలకా
జరుగు జరుగు మనక ఇది జరగలేదు జనక
క్రీస్తు పూర్వమింజను గనక
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
రంగులతో హంగులతో పైన పటారం
అబ్బో సూపరని పొంగిపోకోయ్ లోన లొటారం
అందరిలో నిండలలా ఎంత విడ్డూరం
అయ్యో రైలంటే మిడిల్ క్లాసు నేల విమానం
కూత చూడు జోరుగుందిరో దీని తస్సదియ్య
అడుగు ముందుకేయకుందిరో
ఎంత సేపు దేకుతుందిరో దీని దిమ్మదీయ
చూడు చూడు నత్త నడకరో
ఇది జీవితంలో ఎప్పటికీ టైముకసలు రాదుకదా
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి
దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ
డొక్కుదని బొక్కిదని మూల పడేయ్ రు
ఇలా ముక్కుతున్నా మూల్గుతున్నా తిప్పుతుంటారు
పాత సామాన్లోడికైనా అమ్ముకుంటేను
తలో పిడికెడునో గుప్పెడునో శనగలొచ్చెను
ఎంత పొడవు ఉంది చూడరో దీని బండ బడ
ఊరి చివర ఇంజనుందిరో
ఎంత పొగలు కక్కుతుందిరో దీని దుంపతెగ
బొగ్గు కుండ మింగినాదిరో
నువ్వు ఎక్కబోయే రైలెపుడూ లైఫు టైము లేటు కదా
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి
దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ
బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి
దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ
ధడక ధడక ధడక దీని మాయదారి నడక
ఉలికి ఉలికి పడకే చిలకా
జరుగు జరుగు మనక ఇది జరగలేదు జనక
క్రీస్తు పూర్వమింజను గనక
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే