విల విల విల వాలే పొద్దుకు
రంగులు మల్లి ఉదయించేలా
భగ భగ భగ సూర్యుడి హేళ
జల జల జల జారే కన్నుల
గంగ జలముల పరుగగేలా
ధగ దగ ధగ వీరుడి ఓలా
అగ్గి శిఖలలోన చిక్కిన
మల్లె మొగ్గ కోసం మంచు కెరటమై
దూసుకువచ్చిన సైనికుడు
సైనికుడు
కత్తి కొనాలలోన చిక్కిన పావురాయి కోసం
ప్రాణ కవచమై రణముకు
వచ్చిన రక్షకుడు రక్షకుడు
గుండెలోతులో తెగిన గాయమై
తగువు న్యాయమై వచ్చాడు
కంచు కోటాలో రాకుమారి
పెదవంచులపై చిరు నవ్వావుతాడు
వీడే వీడే
నీ తక్షణ రక్షణ లక్షకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగా మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే
పారేసావో పాతేసావో
నీ ధైర్యం వెతికిచ్చే వాడు
దాచేసావో కాల్చేసావో
నీ కలలన్ని బ్రతికించే వాడు
నువ్వు మరిచిన నిన్ను మరవని
జ్ఞాపకంగా తిరిగొచ్చాడు
నిన్ను వలచిన పడమరంచుకొన
కంచునా మొలిచిన తూరుపు వీడు
వీడే వీడే
నీ తక్షణ రక్షణ లక్షకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగా మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే
విల విల విల వాలే పొద్దుకు
రంగులు మల్లి ఉదయించేలా
భగ భగ భగ సూర్యుడి హేళ
జల జల జల జారే కన్నుల
గంగ జలముల పరుగగేలా
ధగ దగ దగ వీరుడి ఓలా
ఓ అమ్మ ఓడై ప్రేమందించి
నీ హృదయం లాలించే వాడు
ఓ బ్రహ్మ ముడై ఈ సంకెలని
నీ శత్రువుని చేధించేవాడు
ముగిసి పోయిన నుదిటి రాతనే
మలుపు తిప్పు మొదలవుతాడు
సగము వెన్నెల సగము జ్వాలాగా
రగిలే ప్రేమకి కిరణం వీడు
వీడే వీడే
నీ తక్షణ రక్షణ లక్షకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగా మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే