పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం
అంటోంది నా ప్రాణం
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం
అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం
నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
ఎద నీ రాక కోసం
పలికే స్వాగతం
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం
అంటోంది నా ప్రాణం
ఎగిరే గోరింక
ఇటు రావా నావంక
నువ్వు ఎందాక పోతావో
నేను చూస్తాగా
చాల్లే ఎంత సేపింకా
దిగుతావె చక్క
అలిసాక నీ రెక్క
నా గుండెల్లో నీ గూడు
పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురుతులు మరిచే
తికమక పడనీక
అటు ఇటు అంటూ నిను నడిపించే
పిలుపులు నేనేగా
రప్పించుకొన నిను నాదాకా
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం
అంటోంది నా ప్రాణం
కన్నె సీతమ్మకి
పెళ్లీడు వచ్చిందని
కబురు వెళ్ళిందిగా
ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి
తన కొరకే పుట్టిందని
తెలిసి ఉంటుందిగా
కళ్యాణ రామయ్యకి
వేధించే దూరమంతా కరిగేలా
విరహాల విల్లు యిట్టె విరిగేలా
వీడిపోని బంధమేదో కలిపేలా
మెడలోన వాలనుంది వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలల
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం
అంటోంది నా ప్రాణం
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం
అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం
నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
ఎద నీ రాక కోసం
పలికే స్వాగతం
పండువెన్నెల్లో ఈ వేణుగానం
నీదేనా ప్రియనేస్తం
అంటోంది నా ప్రాణం
లలలాలా లలలాలా లాలాలాలాల
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్