భాగ్యనగరం అంతా
మనదే మనదే
నీ బాధే తీరుస్తానే
పదవే పదవే
జంటై పోదామందే
పెదవే పెదవే
దునియాతో పని లేదింక
పదవే పదవే
హే ముద్దు ముద్దుగా ముద్దివ్వమందిగా
ముద్దుగుమ్మిలా ఉన్న పాటుగా
ముద్దు పెట్టడం ఏమంత తేలికా
చుట్టుపక్కలంతా ఉండగా
ఇంటికెళ్లి పెట్టుకుందామంటే
నీకు నాకు ఇంకా పెళ్లి అవలే
ఉన్న చోట తిప్పుతున్నావేంటోయ్
ప్రైవసీకి లేవా బెస్ట్ ప్లేసులే
వెన్నుపూస దాకా వణుకు వచ్చేలా
ఇచ్చుకుందాం హాట్ ముద్దే
తొందరొద్దు బాగా గుర్తుండేలా
ఎంచుకుందాం రొమాంటిక్ చోటే
భాగ్యనగరం అంతా
మనదే మనదే
నీ బాధే తీరుస్తానే
పదవే పదవే
స్మోకింగ్ చేయగా స్మోక్ జోన్ ఉందిగా
కిస్‍కు లేదే కిస్సింగ్ జోన్
ఆల్కహాల్‍కే ఉందిలే వైన్ మార్ట్
ముద్దుకు లేదే సింగిల్ స్పాట్
ఆరోగ్యం చెడగొట్టే
బ్యాడ్ హ్యాబిట్స్‌కే నెలవుందే
స్ట్రెస్ అంతా పోగొట్టే
పెదవులకేంటీ ఇబ్బందే
భాగ్యనగరం అంతా
మనదే మనదే
నీ బాధే తీరుస్తానే
పదవే పదవే
ఊరిస్తున్నదే వేధిస్తున్నదే
ఊహల నిండా నీ ముద్దే
జాగాలేదని జాగే చేయకే
ప్రాణం పోతున్నట్టుందే
అధరాలే అరిగేలా
ఇవ్వాలని ఉందే చుమ్మా
మూడంతా చెదిరేలా
వంకలు చెబుతావేంటమ్మా
భాగ్యనగరం అంతా
మనదే మనదే
నీ బాధే తీరుస్తానే
పదవే పదవే