ఓ నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈరోజిలా ఎందుకె
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈవెళిలా ఎందుకె
నువ్విలా నాలో నేనిలా నీలో
లీనమైపోయేందుకే
నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈరోజిలా ఎందుకె
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్లా కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండా చేసి
ఇది ప్రేమ అనుకుంటూ అడుగేసాన
నేనేనా
నిను నేనే ఏవేవో అడిగేసాన
నిజమేనా
నీ నీడలో నేనుండగా
నీ అడుగుల వెంటే నేనే కదా
నీ చూపులే నా మనసుని
అ అడిగినవన్నీ నిజమే కదా
కదిలేనా నీ పలుకు లేకుండానే
క్షణమైనా
నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈరోజిలా ఎందుకె
కను తెరిచి ఏవేవో చూస్తూ ఉన్న
కనబడదే కనబడదే
కనులెదుట నీ రూపే కదులుతూ ఉంది
కల కాదే కల కాదే
నీ లోకమై నేనుండగా
నీ చూపుల నిండా నేనే కదా
నా ఊపిరై నువ్వుండగా
నా ఈ ప్రాణం నీదేకదా
కడదాకా ఒకటై నిలవాలి
ఏమైనా
నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈరోజిలా ఎందుకె
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈవెళిలా ఎందుకె
నువ్విలా నాలో నేనిలా నీలో
లీనమైపోయేందుకే
Ninnala lede monnala lede
Eerojila enduke
Ninila nake kotthaga chupe eevelila enduke
Nuvvila nalo neenila neelo
Leenamaipoyenduke
Ninnala lede monnala lede
Eerojila enduke
Naa ee gunde na adhupu thappi
Nee ee kanulu nee vaipu thippi
Naa ee manasu neethoti kalipi
Nene neelo niluvella kalisi
Nee aa pedavi o navvu chupi
Mounagane ededo telipi
Nalo unna pranalu nalipi
Nene naku lekunda chesi
Idi prema anukuntu adugesana
Nenena
Ninu nene evevo adigesana
Nijamena
Nee needalo nenundaga
Nee adugula vente nene kada
Nee chupule na manasuni
Adiginavanni nijame kada
Kadilena nee paluku lekundana
Kshanamaina
Ninnala lede monnala lede
Eerojila enduke
Kanu therichi evevo chustu unna
Kanabadade Kanabadade
Kanuleduta nee roope kaduluthu undi
Kala kade Kala kade
Nee lokamai nenundaga
Nee chupula ninda nene kada
Na oopirai nuvvundaga
Na ee praanam needekada
Kadadaka okatai nilavali
Emaina
Ninnala lede monnala lede
Eerojila enduke
Ninila nake kotthaga chupe eevelila enduke
Nuvvila nalo neenila neelo
Leenamaipoyenduke