నిండైన నీ చెలిమి ననువదిలి పోయెనే ఎందుకె
తీయనైన నీ ప్రేమే న తెరవాలి పోయే ఎందుకె
కష్టమే సుఖమనిపించే చేరాక నీతోనే
ఇష్టమే బాధనిపించే వీడినాక నీ తోడే
నిండైన నీ చెలిమి ననువదిలి పోయెనే ఎందుకె
మనసే తానే నే తలచిన తానే
మరచిన తానే ఇదంతా యాతనే
నిజమాయె కలే చెరిపేనే తానే
శాసించెనే తానే నా తల రాతనే
మరిక మిగిలెను వేదనే మరపుకే రాదే
కరిగి ముగిసిన ఈ కథే కంచికే పోదే
నిండైన నీ చెలిమి ననువదిలి పోయెనే ఎందుకె
హృదయం తానే నా హృదయము తానే
నిదురలో తానే కలలో తానే
కనులలో తానే కదిలిన తానే
నీడైన తానే తోడైన తానే
అపుడు బోగీ మంటల వెచ్చగా నిలిచే
ఇపుడు దారి చూపగా వెనకకు రాదే
నిండైన నీ చెలిమి ననువదిలి పోయెనే ఎందుకె
తీయనైన నీ ప్రేమే న తెరవాలి పోయే ఎందుకె
కష్టమే సుఖమనిపించే చేరక నీతోనే
ఇష్టమే బాధనిపించే వీడాక నీ తోడే