• Song:  Anaganaga Oka Uru
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

అనగనగ ఒక ఊరు అనుకోకుండా ఒక నాడు కలిసారే పసివాళ్లు స్నేహంగా సంతోషమంతా రెక్కలుగా రివ్వంటూ ఎగిరే పక్షులుగా ఆకాశమంత ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా ఒకరేమో శీను ఒక్కరేమో జున్ను కలిసారే ప్రాణంగా కురిసారె వర్షంగా పాటేమో శీను ఆటేమో జున్ను ఒకటై ఎదిగారే మధురంగా ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా తీయ తియ్యని ఊసులతో తెల తెల్లని మనసులలో కథ ఇలాగ మొదలయ్యేగా కథ ఇలాగ మొదలయ్యేగా అనగనగ ఒక ఊరు అనుకోకుండా ఒక నాడు కలిసారే పసివాళ్లు స్నేహంగా ఎగిరిన బుడకలలోన చెలిమే ఉరికిన పడవలలోన చెలిమే రంగుల రాట్నంలో చెలిమే చిందులు వేసిందే మిణుగురు వెలుగులలోన చెలిమే తొలకరి తేనెలలోన చెలిమే గాజుల గలగాలలో చెలిమే సందడి చేసిందే ఈ జ్ఞ్యాపకాలన్నీ నిలిచెను లే మీ జీవితానికి బలమై నడిపెనులే ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంభాలే అనగనగ ఒక ఊరు అనుకోకుండా ఒక నాడు కలిసారే పసివాళ్లు స్నేహంగా తెలుపని కబురులలోన చెలిమే తిరగని మలుపులలోన చెలిమే దొరకని చూపులలో చెలిమే దోసిలి నింపింది జరిగిన నిమిషములోన చెలిమే ఎరగని మరు నిమిషాన చెలిమే కాలం చెక్కిలిలో చెలిమే చుక్కై మెరిసిందే చిన్ననాడు మురిపించే ఈ గురుతులే కానరాని దారిని చూపే మీ గురువులే ఉండాలంటూ ఈ బతుకంతా ఈ మాటలకి కట్టుబడే
Anaganaga oka uru Anukokunda oka naadu Kalisaare pasivallu snehanga Santhoshamantha rekkaluga Rivvantu yegire pakshuluga Aakasamantha aataadukuntu Unnaru saradhaga Okaremo seenu okkaremo junnu Kalisaare prananga Kurisaare varshanga Paatemo seenu aatemo junnu Okatai yedhigaare madhuranga Prapanchamantha thama illantu Prathi kshanam oka pandugaga Kanneeru leni kalale kantu Chinnari chelime balapadaga Thiya thiyyani oosulatho Thela thellani manasulalo Katha ilaaga modhalayyegaa Katha ilaaga modhalayyegaa Anaganaga oka ooru Anukokunda oka naadu Kalisaare pasivallu snehanga Yegirina budakalalona chelime Urikina padavalalona chelime Rangula ratnamlo chelime Chindhulu vesindhe Minuguru velugulalona chelime Tholakari thenelalona chelime Gaajula galagalalo chelime Sandhadi chesindhe Ee gnyaapakaalanni nilechenu le Mee jeevithaaniki balamai nadipenule Ee saakshyale anubhandhala Bhavanaaniki sthanbhaale Anaganaga oka ooru Anukokunda oka naadu Kalisaare pasivallu snehanga Thelapani kaburulalona chelime Thiragani malupulalona chelime Dhorakani choopulalo chelime Dhosili nimpindhi Jarigina nimishamulona chelime Yeragani maru nimishana chelime Kaalam chekkililo chelime Chukkai merisindhe Chinanaadu muripinche ee guruthule Kanaraani dhaarini choope mee guruvule Undaalantu ee bathukantha Ee maatalaki kattubade
  • Movie:  Hello
  • Cast:  Akhil Akkineni,Kalyani Priyadarshan
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music