ఎందుకిలా నన్ను వేదిస్తున్నవే
ఎందుకని నన్ను వెలివేస్తున్నవే
నా హృదయం నీ తోడే కోరుకుందన్నఆ
నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందన్నా
అన్యాయంగా తోస్తుంటే నట్టేటిలో ఇలా
నేనేమయిపోవాలి నిన్నేమనుకోవాలి
ఎహ్ మనసును తిట్టాలి ఈ క్షణం హ్మ్మ్
ఎందుకిలా నన్ను వేదిస్తున్నవే
ఎందుకని నన్ను వెలివేస్తున్నవే
ఓహ్ నను నేనే వదిలేసి నువ్వే కావాలంటున్న
నాదంటూ మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్న
నేను నీకు వద్దని నీతో నడవద్దని
నీ దారే నీదని గీశావా గీతని
నీ గుండెల్లోనా గురుతుల్ని
నన్నే తాకే అలల తుడిచేస్తే
నేనేమయిపోవాలి నిన్నేమనుకోవాలి
ఎహ్ మనసును తిట్టాలి ఈ క్షణం ఓహ్ ఓహో
ఓహ్ బ్రతుకంతా తరిమేసి చీకటిలో నను తోస్తావా
గతమంతా చెరిపేసి శూన్యం లో నిలబెడతావా
నాకన్ని నువ్వని అనుకోవడం పాపమా
పూజించే చేతిని నరికెంత కోపమా
నీ తలపుల్లో మైమరపుల్లో
నా మనసును తిప్పి రెక్కలు విరిచేస్తే
నేనేమయిపోవాలి నిన్నేమనుకోవాలి
ఎహ్ మనసును తిట్టాలి ఈ క్షణం ఓహ్ ఓహో
ఎందుకిలా నన్ను వేదిస్తున్నవే
ఎందుకని నన్ను వెలివేస్తున్నవే