అంజనాద్రిపై సంతతి కొరకై
అహో రాత్రములు
తపస్సు చేసే వానర కేసరి
కేసరి కులసతి కడుపు పండగా
జనించినాడొక అసమాన
భలోద్బదుడు సంయుతుడూ
అంజనా సుతుడూ పవన నందనుడూ
అరుణ కిరణముల ఉదయాగ్నిని కని
అది పండిన తియ్యని పండనుకొని
సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే
తన దేహం మాటున రవిమరుగై
జగము చీకటై పోగా
అది అమరేంద్రుడు గమనించి
తన ఐరావతమధిరోహించి
ఆంజనేయుని సమీపించి
తన వజ్రాయుధమును విసరగా
అది పవన నందనుని హనుముని తాక
చిందిన రక్త బిందువే
విద్యుత్ వేగంతో ధరణీ స్థలి
గంగ కడలిలో చొచ్చి
గంగ కడలి అట్టడుగున గల
శ్రీ రంగ శుద్ధి గర్భమ్ము చేరి యట
కాలక్రమమున ఘనీభవించి
హనుమ రుధిరమని ఘనియై
అర్హత గల ఒక సహృదయునికై
నిరంతనిశ్చల నిరీక్షణం
వర్ష సహస్రక నిరీక్షణం
నిరంతనిశ్చల నిరీక్షణం
వర్ష సహస్రక నిరీక్షణం