ఏమంటారో నాకు నీకున్న ఇది నీ
ఏమంటారో నువ్వు నేనైనా అది నీ
ఏమంటారో మారిపోతున్న కధ నీ
ఏమంటారో జారిపోతున్న మది నీ
చూసే పెదవిని మాటాడే కనుల నీ
నవ్వే నడకని కనిపించే శ్వాస నీ
ఇఛ్చి పుచ్చూకున్న మనసుని ఇదా అదా యదావిధా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇది నీ
ఏమంటారో నువ్వు నేనైనా అది నీ
ఏమంటారో మారిపోతున్న కధ నీ
ఏమంటారో జారిపోతున్న మది నీ
ఎదురుగా వెలుగుతున్న నీడని
బెదురుగా కలుగుతున్న హాయిని హో హో
తనువున తొణుకుతున్న చురుకునీ
మనసున ముసురుకున్న చెమటనీ
ఇస్ట కష్టాలని ఇపుడేమంటారో
ఈ మొహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో
సమీప దూరాలని అసలేమంటారో
జారే నింగిని దొరలాంటి దొంగానీ
పాడే కొంగుని పరిమళించే రంగునీ
పొంగుతున్న సుధా గంగని ఐ
ఇదా ఆదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపోతున్న కధ నీ
ఏమంటారో జారిపోతున్న మది నీ
జాబిలై తళుక్కుమన్నా చుక్కాని
బాధ్యతై దొరుకుతున్న హక్కుని
దేవుడై ఎదుగుతున్న భక్తుని
సూత్రమై బిగియనున్న సాక్షి ని
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పోట్లాటలో శాంతి నీ మరి ఏమంటారో
తప్పులో ఓప్పుని ఇపుడేమంటారో
గత జన్మలో అప్పుని అసలేమంటారో
నాలో నువ్వుని ఇకనీలో నేను నీ
మాకే మేమని మాన దారే మనదని
రాసుకున్న ఆత్మ చరితాని అదా ఇదా ఇదే అదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇది నీ
ఏమంటారో నువ్వు నేనైనా అది నీ
ఏమంటారో మారిపోతున్న కధ నీ
ఏమంటారో జారిపోతున్న మది నీ