దుంత నకరా నకరా నకరా
దుంత నకరా నకరా నకరా
పిల్లి మనకు ఎదురు పడితే
పన్నులు ఏవి జరగవంటా
మనం పిల్లికి ఎదురు పడితే
కర్మ కాలి చచ్చునంటా
బల్లి పలుకు సత్యం అంట
బల్లి పడితే దోషం అంట
నక్క తోక లక్ -ఉ అంట
నక్క అరుపు మృతువు అంట
ఎందుకు ఎందుకు ఎందుకు
ఎందుకు ఎందుకు ఎందుకో
హోం ఎందుకో ఎందుకో
రెండు కాలు మనకు ముఖ్యమంటూ
కుడి కాలు ముందు అంటూ
మూఢనమ్మకాలు ఎందుకో
హోం ఎందుకో ఎందుకో
జీవ రాశులన్నీ దైవం అంటూ
జంతు బలులు ఇంకా ఎందుకో
నీలోనే ధైర్యం ఉండగా దారాలు ఎందుకో
నీ ఆత్మశక్తి ఉండగా తయాతులెందుకో
చేతలే చెయ్యక
చేతికే రంగురాలు ఉంగరాలు ఎందుకో
పేరుకేమో మంగళవారం పన్నులకేమో అమంగళం
శని ఉన్న శనివారం జరుపుతారు శుభకార్యం
బండి లోన వంద లాది పరికరాలు ఉన్న గాని
ఇంత నిమ్మకాయ పైన అంతు లేని విశ్వాసం
ఎందు ఎందు ఎందు ఎందు ఎందుకెందుకో
హోం ఎందుకో ఎందుకో
భూమి బంతి లాగ తిరుగుతుంటే
దిక్కులన్నీ మారుతుంటే
వాస్తు నమ్మకాలు ఎందుకో
హోం ఎందుకో ఎందుకో
ఓ నీవు ద్రుష్టి కాస్త మార్చుకుంటే
ద్రిష్టి బొమ్మలింకా ఎందుకో
శూలాలు నోటిలోపల గుచ్చేది ఎందుకో
పాలన్నీ పుట్టలోపల పోసేది ఎందుకో
సూటిగా ఎప్పుడు నడవక
ఇంకా నిప్పు లోన నడక ఎందుకో
గో గో గో గోపాల గో గో గూ గోపాల
గో గో గో గోపాల గో గో గూ గోపాల