• Song:  Rama Chakkani
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Gayatri Ashokan

Whatsapp

నీల గగన ఘనవిచలన ధరణిజ శ్రీ రమణ మధుర వదనా నళిన నాయన మనవి వినరా రామ రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట రామ చక్కని సీతకి ఉడతా వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి ఎర్ర జాబిలీ చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట రామ చక్కని సీతకి ఇందువదనా కుందరాదన మందగమన భామ ఎందువలన ఇందువదనా ఇంత మదన ప్రేమ
Neela Gagana Ghanavichalana Dharanija Shree Raman Madhura Vadana Nalina Nayana Manavi Vinaraa Rama Rama Chakkani Seetaki Aracheta Gorinta Inta Chakkani Chukkaki Inkevaru Mogudnta Rama Chakkani Seetaki Udata Veepuna Velu Vidichina Pudami Alludu Ramude Yedama Chetanu Shivuni Villunu Ettaina Ramude Yettagalada Seeta Jadanu Tali Katte Velalo Rama Chakkani Seetaki Erra Jaabili Cheyi Gilli Ramudedani Adugutunte Choodaledani Pedavi Cheppe Cheppalemani Kanulu Cheppe Nallapoosainadu Devudu Nallani Raghuramudu Rama Chakkani Seetaki Chukkanadiga Dikkunadiga Chemmagillina Choopunadiga Neeru Pongina Kanulalona Neeti Terale Adduniliche Choosukomani Manasu Telipe Manasu Matalu Kaduga Rama Chakkani Seetaki Aracheta Gorinta Inta Chakkani Chukkaki Inkevaru Mogudnta Rama Chakkani Seetaki Induvadana Kundaradana Mandagamana Bhama Yendhuvalana Induvadana Inta Madana Prema
  • Movie:  Godavari
  • Cast:  Kamalinee Mukherjee,Sumanth
  • Music Director:  K. M. Radha Krishnan
  • Year:  2006
  • Label:  Aditya Music