ప్రపంచమా క్షమించుము మాకు మీతో పనేమిలేదమ్మా
వసంతమా వారించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మ
కాంచన కాంతుల భామ నీ కంచలు తెంచుకు రమ్మ
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆఆ ఆఆ
వసంతమా వారించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మ
కుడిఎడమలు ఎరుగక మన కథ సాగేనంటా
జత కుదరని ఎదలకు పెరగద ఏదో మంట
ఎవరెవరికో ఎదరగిలేయితే అది మనకేమంటా
కనులడిగిన కళలను తరుముతూ పోదామంటా
మనకు మనకు గల ముచ్చట మరులెవరు కానని చోటెచ్చట
ముడులు విడని బిగి కౌగిట తగు విడిది మనకు దొరికేనట
మరి ఆలస్యం ఇంకా ఎంటటాఅఅ
ప్రపంచమా క్షమించుమ మాకు మీతో పనేమిలేదమ్మా
తెరమరుగున నిలువక చొరవగా రారమ్మంటా
అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా
కలవరపడి గుస గుస కబురును విన్నానంటా
మనసెరిగిన వరసతో సరసనే ఉన్నానంటా
ఉరుము వెనక జడివానలా ఈ విరహమంతా కరిగిఏదెలా
దిగులు పడకు నువ్వంతల తొలివలపు తెగని విరిసంకెల
మరి దూరంగా ఉంటే ఇంకెలాఆ
వసంతమా వారించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మ
కాంచన కాంతుల భామ నీ కంచలు తెంచుకు రమ్మ
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆఆ ఆఆ