నా ఇంటిముందున్న పూతోటనడిగేవో
నా వొంటి పైన జారే నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపెనే
నువ్వే నా ప్రాణమే
నా ఇంటిముందున్న పూతోటనడిగేవో
నా వొంటి పైన జారే నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపెనే
నువ్వే నా ప్రాణమే
నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట
మనసారా చేరే వేళా మౌనాలే తగదంట
సుడిగాలే రేగిందంటే చిగురాకే చిత్తంటా
వింతైన ఈ కవ్వింత నా వాళ్ళ కాదంట
ఆషాడం పోయిందో గోదారి పొంగెను
వైశాఖం వచ్చిందో అందాలే పూచెను
ఈడే సద్దు చేసెను
నీ ఇంటి ముందున్న పూతోటనడిగేవో
నీ వొంటి పైన జారే నీ పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ ఊసే తెలిపెనే
నేనే నీ ప్రాణమే
నీ ఇంటి ముందున్న పూతోటనడిగేవో
నీ వొంటి పైన జారే నీ పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ ఊసే తెలిపెనే
నేనే నీ ప్రాణమే
గుండెల్లో ఒక ఊహ ఉయ్యాలా ఊగింది
మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసెను
చూపులకే నడకోస్తే స్వర్గాలే చేరెను
యెనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి
మ్మ్ హ్మ్మ్ మ్మ్ పరవశమే
నా ఇంటిముందున్న పూతోటనడిగేవో
నా వొంటి పైన జారే నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపెనే
నువ్వే నా ప్రాణమే
నీ ఇంటి ముందున్న పూతోటనడిగేవో
నీ వొంటి పైన జారే నీ పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ ఊసే తెలిపెనే
నేనే నీ ప్రాణమే