ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి
బుగ్గ మీద చుక్కపెట్టి
వాగాళ్లే నడిచావే
నీ బుట్టలో పువ్వులన్ని
గుట్టులన్నీ రట్టు చేసి
నన్నీడా పిలిచెనే
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
పల్లి పల్లి ముదినేపల్లి
పల్లి పల్లి ముదినేపల్లి
కాటుక కళ్ల వాడల్లో కట్టుకుంటా గుడిసెంటా
పసుపుతాడు పడకుండా ఆగడాలు వద్దంటా
చింతపల్లి చిన్నోన్ని చూడు నీకు వరసంటా
వరస కాదు నాకంట మనసు ఉంటె చాలంటా
పగలు రేయి నీతో ఉంటా
ఉన్నావంటే అది తప్పంటా
కలిసి వస్తే ఎన్నెల మాసం
చెయ్యాలి జాగారం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పెనమ్మ
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పెనమ్మ
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు
ముద్దరాలి సొగసుకి గాలలే వేస్తావే
తమలపాకు తడిలోన పండెనే నీ నోరంతా
నోటి పంట కాదంట పాడిపంట చుడంట
నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
ఆశ పడిన మావయ్యది అందమైన మనసాంటా
అందం చందం నీకే సొంతం
వెన్నెల్లోనే ఏస మంచం
పైరగాలుల పందిరిలోన
కరిగిపోదాం మనం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పెనమ్మ
బుట్ట మీద బుట్ట పెట్టి
నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు
ముద్దరాలి సొగసుకి గాలలే ఏసావే