సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేని వికాసమెందుకని నిజాన్ని బలి కోరే సమాజమెందుకని అడుగుతోంది అదిగో ఎగిరే భారత పతాకం ఆవేశంలో ప్రతినిముషం ఊరికే నిప్పుల జలపాతం కత్తికోనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం బంగారు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు భస్మాసుర హస్తాలే ప్రగతికి సమాధి కడుతుంటే శిరసు వంచేనదిగో ఎగిరే భారత పతాకం చెరుగుతుంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభావం సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేని వికాసమెందుకని కులమతాల దావానలానికి కరుగుతున్నది మంచుశిఖరం కలహముల హాలా హలానికి మరుగుతున్నది హిందూసంద్రం దేశమంటే మట్టికాదను మాట మరచెను నేటి విలయం అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం విషము చిమ్మెను జాతి తనువునా ఈ వికృత గాయం
Suraajyamavaleni swaraajyamendukani sukhaana manaleni vikaasamendukani nijaanni bali kore samaajamendukani aDugutondi adigo egire bharata pataakam Aavesamlo pratinumusham urike nippula jalapaatam kattikonala ee vartamaanamuna bratakadu saanti kapotam bangaru bhavitaku punaadi kaagala yuvata prataapaalu bhasmaasura hastaalai pragatiki samaadhi kadutunte sirasu vanchenadigo egire bharata pataakam cherugutundi aa talli charitalo viswa vijayaala vibhavam Suraajyamavaleni swaraajyamendukani sukhaana manaleni vikaasamendukani Kulamataala davaanalaaniki karugutunnadi manchusikharam kalahamula haalaa halaaniki marugutunnadi hindusandram desamante mattikaadanu maata marachenu neti vilayam amma bhaarati balini korina raachakurupee raajakeeyam vishamu chimmenu jaati tanuvunaa ee vikruta gaayam
Movie: Gayam Cast: Jagapati Babu,Revathi,Urmila Matondkar Music Director: Sri Kommineni Year: 1993 Label: Aditya Music