నీ జతై
సాగింది పాదమే
ఆపినా ఆగునా
లోలోని వేగమే
ఆ ఆ హా ఆ ఆ
ఆ ఆ హా ఆ ఆ
నీ జతై
సాగింది పాదమే
ఆపినా ఆగునా
లోలోని వేగమే
వెలుగుల దారుల్లో
విరిసిన రంగుల్లో
ప్రతిక్షణం ఒక్కో వరం
అయినది ఈ వేళ
తరిమిన ఊహల్లో
తరగని ఊసుల్లో
పెదవుల పైన
నవ్వై ఎదురొస్తుంటే
ఎంతో అందం
కనిపిస్తుంటే ఏదో బంధం
చిరు చిరు ఆశ మధురమే
ఎగిసిన స్వాస మధురమే
ప్రతి ఒక బాస మధురమే
పైపైనా వాలుతుంటే
ఆ మంచు పూల వాన
మనసుల పాట మధురమే
వలపుల బాట మధురమే
కలిసిన చోట మధురమే
రమ్మంటు పాడుతున్న
ఆ స్వాగతాలలోనా
ఎదుట నువ్వు ఉంటే
ఎదకు రెక్కలొచ్చే
ప్రపంచాన్ని దాటుతు
నింగి మీటుతు అలా
నీలి మబ్బుల్లో
తేలే గువ్వల్లా
రివ్వు రివ్వంటూ
ఎగిరెల్దాం పదా
కాలంతో పందెం వేసేద్దాం
కలలన్నీ నిజమే చేసేద్దాం
సరదాల అంతే చూసేద్దాం
సంతోషం మనమే అయిపోదాం
ఎన్నెన్నో ఆశలు పోగేద్దాం
ఓ కొత్త లోకం కట్టేద్దాం
ఆ కోటి చుక్కలు అష్టదిక్కులు
ఒక్కటై ఇలా చుట్టు చేరగా
చిరు చిరు ఆశ మధురమే
ఎగిసిన స్వాస మధురమే
ప్రతి ఒక బాస మధురమే
పైపైనా వాలుతుంటే
ఆ మంచు పూల వాన
మనసుల పాట మధురమే
వలపుల బాట మధురమే
కలిసిన చోట మధురమే
రమ్మంటు పాడుతున్న
ఆ స్వాగతాలలోనా