అందాల అందాల
అందం నన్నే తాకి పోయే
అందెల్లో జారి నే పడిపోయానే
మందార మందార
గంధం గాల్లో కలిసి పోయే
వయ్యారి చూపే పరుగెట్టి
వలలే పట్టి నను పట్టే
అయ్యో నా కనులే చేరి
కలలడిగే పిల్లరా
నయగారమే నాపై చల్లే
బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే
అదో ఇదో ఎదో అనేసాకే అలజడి కలిగే
యధావిధి ఎదే ఏమాయెనే
మది వలపులు చిలికే
హడవిడి పడి పడేసావే మనసను మదినే
పదే పదే అదే సొదాయెనే
వెన్నెలైపోయే చీకటే వేళ
వన్నెలే ఉన్న వాకిటే
దారుణాలు తగవే
కన్నుల కారణాలు కనవే
విడువనులే చెలి నిను క్షణమే
బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
సింధూరివే
సరి గమ పద పెదాలేవో ప్రేమని వెతికే
బుధ గురు అనే రోజేలనే
తొలి వలపుల జతకే
నది నదానికే ముడేసాకే
తనువులు తొనికే
అదే అదే వ్యదే కధాయేనే
నీడలా వెంట సాగని
నీలి కళ్లలో నన్ను దాగని
వాయిదాలు అనకే
గుండెలో వేదనేదో వినవే
మనువడిగే మధనుడి స్వరమే
బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే