హే పిల్లా
అట్లా నవ్వేసేసి పారిపోమాకేయ్ బాబూ
మీరేంట్రా నన్ను చూస్తున్నారూ
ఎవడి డప్పు వాడు కొట్టండహేయ్
హే గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
హే నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా
హే గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
హే నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా
హే సుందరి సుందరి సుందరి మనసునే చేసినవే ఇస్తిరీ
స్ట్రాబెర్రీ బ్ల్యూబేరి బ్లాక్బెర్రీ మిక్స్ చేసి
లిప్పులో పెట్టినవే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ
పిల్లా నువ్వులేని జీవితం
నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం
అః పిల్లా నువ్వులేని జీవితం
ఆవకాయ బద్దలేని మందు కంటే దారుణం
హే గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
హే నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా
పంచదార పెట్టి రుద్దినట్టూ
మంచి తేనే తెచ్చి అద్దినట్టూ
ద్రాక్ష పండు తీసి పిండినట్టూ
ఎంతా తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ
వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు విన్నాంలే
పొయ్యి మీద పాలు పొంగినట్టు విన్నాంలే
పూటకొక్క పండగొచ్చినట్టు
ఏదేదో అవుతోంది నీ మీద వొట్టూ
సంపకే సంపకే సంపకే
నిప్పులాంటి నవ్వులొకి దింపకే
ఏ చింపకే చింపకే చింపకే
నల్లని రాత్రిని చింపకే రంగుతో నింపకే
పిల్లా నువ్వులేని జీవితం
బ్రేక్ లేని బైక్ నే రయ్యిమంటూ తోలడం
హే పిల్లా నువ్వులేని జీవితం
ట్రాక్ లేని ట్రైన్ మీద కుయ్యుమంటూ వెళ్లడం
ఒక్క జానెడంట కప్పు కోసం
పెద్ద వరల్డ్ కప్ జరుగుతాది
నీ నవ్వులున్న లిప్పు కోసం
చిన్న వరల్డ్ వార్ జరిగినా తప్పులేదు
కొన్ని వేళా కోట్ల అప్పు కోసం
కాపు కాసి ఉన్నదంతా దేశం
ఒక్క నవ్వునంతా ఇవ్వు పాపం
దాని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే
కొట్టినా కొట్టినా కొట్టినా గుండెలోన దాగి ఉన్న డప్పునీ
నువ్వు రాసినా రాసినా రాసినా నవ్వుపై
ఎవ్వరూ రాయని మస్తు మాస్ పాటనీ
పిల్లా నువ్వులేని జీవితం
తాడూలేని బొంగరాన్ని గిర్రుమంటూ తిప్పడం
హే పిల్లా నువ్వులేని జీవితం
నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం
హే పిల్లా