గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా
నీడవై చాటుగా వున్నావుగా
మాటలే చేత కాక సైగ చేశానుగా
సంతకం లేని లేఖ చేరనే లేదుగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా
నీ వెంటే తరుముతు ఉంటె
అసలు కన్నెత్తి చూసావా నన్ను
మరి నీ ముందే తిరుగుతూ ఉంటె
ఎపుడు పన్నెత్తి పిలిచావా నన్ను
రోజు ఇలా ఈ గాలిలా
నీ చెవిని తాకేది నేనేగా
మామూలుగా మాటాడక
ఈ గాలి గోలేంటి చిత్రంగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా
నీడవై చాటుగా వున్నావుగా
కాస్తైనా చోరవ చెయ్యందె
వరస కలిపేదెలాగంటా నీతో
నువ్వు కొంతైనా చనువు ఇవ్వందె
తెల్సుకోలేను నీ సంగతేదో
వెంటాడక వేటాడక
వలలోన పడుతుందా వలపైనా
నన్నింతగా వేధించక
మన్నించి మానసివ్వు ఇపుడైనా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా
నీడవై చాటుగా వున్నావుగా
మాటలే చేత కాక సైగ చేశానుగా
సంతకం లేని లేఖ చేరనే లేదుగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
కళ్ళలో చేరవా చెలి చిలక
శ్వాసలో కోరిక వున్నావుగా