• Song:  Prathi Nijam Pagati
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్లీ ఎదురీత ఏనాడు ఏ తీరం ఎదుట కనపడక ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా పెదవులు మరచిన చిరునగవై నిను రమ్మని పిలిచానా వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా నిదరపోయే ఎదను లేపి నిశిని చూపించగా ఆశతో చాచిన దోసిట శూన్యం నింపి కరగకుమా నా కన్నులనే వెలివేసి ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా సగములోనే అలసిపోయి పయనం అయ్యాగా ఇసుకలో చేసిన సంతకమా నీ స్నేహం ఏ అల నిను చెరిపిందో తెలుపదు కాలం
Prati nijam pagati kalagaa Niraashaga nilavanaa Prati kshanam kalatha padaga Nireekshaga gadapana Kanneeti sandramlo naavanai Yennalli edureeta Enaadu ea teeram Yeduta kanapadaka Prati nijam pagati kalagaa Niraashaga nilavanaa Prati kshanam kalatha padaga Nireekshaga gadapana Pedavulu marachina chirunagavai Ninu rammani pilichana Vetakani velugula parichayamai Varamimmani adigaana Nidarapoye yedanu lepi Nishini choopinchagaa Aashatho chaachina dosita Shunyam nimpi Karagakuma naa kannulane Velivesi Prati nijam pagati kalagaa Niraashaga nilavanaa Prati kshanam kalatha padaga Nireekshaga gadapana Ekkada nuvvani dikkulalo Ninu vetikina naa keka Shilalanu takina pratidhwani ga Nanu cherite ontariga Sagamulone alasipoyi Payanam ayyaaga Isukalo chesina santakamaa Nee shneham E ala ninu cheripindho Telupadu kaalam
  • Movie:  Ela Cheppanu
  • Cast:  Shriya Saran,Tarun
  • Music Director:  Koti
  • Year:  2003
  • Label:  Aditya Music