గుండె గూటికి పండుగొచ్చిందీ
పండు వెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లీ
ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది
గుండె గూటికి పండుగొచ్చిందీ
పండు వెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లీ
ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది
నేలనొదిలిన గాలి పరుగున
ఊరంతా చుట్టాలే
వేళా తెలియక వేళా పనులను
వేగంగా చేయాలీ
నా ఇంటి గడపకి మింటి మెరుపులా
తోరణమే కట్టాలీ
కొంటె కలలతో జంట చిలకకి
స్వాగతమె చెప్పాలీ
ఎన్నెనో
ఎన్నెనో చేసినా ఇంతేనా అనిపిస్తోంది
ఏ పని తోచక తికమక పెడుతుంది
గుండె గూటికి పండుగొచ్చిందీ
పండు వెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లీ
ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది
బావ మమతల భావ కవితలే
శుభ లేఖలు కావాలీ
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు
సుముహూర్తం రావాలీ
మా ఏడూ అడుగుల జోడు నడకలు
ఊరంతా చూడాలీ
వేలు విడువని తోడు ఇమ్మని
అక్షింతలు వెయ్యాలీ
ఇన్నాళ్లూ
ఇన్నాళ్లు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకుని వచ్చి
కల కల కనపడగా
గుండె గూటికి పండుగొచ్చిందీ
పండు వెన్నెల పంచుతుంది
మబ్బుల్లో జాబిల్లీ
ముంగిట్లో దిగుతుంది
నా ఇంట్లో దీపం పెడుతుంది