తరార రత్తత్తార రత్తత్తారరరా
తరార రత్తత్తార రత్తత్తారరరా
నవమల్లిక నేనై పూచానోయ్
నా పరిమళమంతా దాచానోయ్
గ్రహించే గాలివి నువ్వై
సృశించే చినుకువి నువ్వై
ధరించే సిగవై చేరుకోరా సుందరా
నువ్వే ముఖ చిత్రం అయిన
పుస్తకం అయి ఉన్నాను
ప్రతి ఒక పేజీ వదలక
చదువుకు పొమ్మన్నాను
నవమల్లిక నేనై పూచానోయ్
నా పరిమళమంతా దాచానోయ్
శ్వాస మరిగినదోయ్
ఆశ తరిమినదోయ్
గోష గుండెల చాటున
పెరిగిందోయ్
పైట నిలబడదోయ్
మాట తడబడెనోయ్
పూట గడవని పరువం
పలికిందోయ్
రోజు నీ పేరే రామనామంలా
ఆలపించాను నమ్మరా
ఒక్క రోజైన సీతలా నన్ను
స్వీకరిస్తేనే చాలురా
నువ్వే ముఖ చిత్రం అయిన
పుస్తకం అయి ఉన్నాను
ప్రతి ఒక పేజీ వదలక
చదువుకు పొమ్మన్నాను
నవమల్లిక నేనై పూచానోయ్
నా పరిమళమంతా దాచానోయ్
తరార రత్తత్తార రత్తత్తారరరా
తరార రత్తత్తార రత్తత్తారరరా
పూవు పూజాకని పండు విందుకని
నీకు తెలుసును కదరా సుందరుడా
నేను మగువనని నాది సొగసు అని
అంత తెలిసిన మీదట ఎందుకిలా
పరులకో న్యాయం నాకు ఓ న్యాయం
ప్రియతమా నీకు న్యాయమా
నేను మగ అయితే నువ్వు మగువైతే
తక్షణం నిన్నే ఏలనా
నువ్వే ముఖ చిత్రం అయిన
పుస్తకం అయి ఉన్నాను
ప్రతి ఒక పేజీ వదలక
చదువుకు పొమ్మన్నాను
నవమల్లిక నేనై పూచానోయ్
నా పరిమళమంతా దాచానోయ్