ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాల
మెరుపులు మొదలైతే
ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే
ప్రతి రోజు పండగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
ఇంటి పేరు ఉల్లాసమే
సొంత ఊరు సంతోషమే
కంటినిండుగా కలలుండగా
చేరాదంట కన్నీరే
అల్లరంతా మా సంపదే
చెల్లదంట ఏ ఆపాదే
తుళ్ళి తుళ్ళి పొంగేనంటా ఆట పాట
అల్లిబిల్లి ఆకాశంలో అమ్మ నాన్న
అక్క చెల్లి మల్లెపూల మబ్బులైతే
ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే
ప్రతి రోజు పండగ రోజు
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
అందమైన మా స్నేహమే
అల్లుకున్న ఓహ్ హారమే
సుడిగాలి చెడు జ్వాలకి
తెగిపోదు ఈ దారమే
గుడిలోని ఆ దైవమె
అడిగెను ఆతిధ్యమే
గుమ్మంలోనే వాలేనంత దేవాలయం
చిన్ని చిన్ని కోపాలన్నీ
చిర్రుబుర్రు తపాలాన్ని
వచ్చిపోయే ఉరుమైతే
ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే
ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాల
మెరుపులు మొదలైతే
ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే
ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే