చెప్పనా చెప్పనా చిన్న మాటా
చెప్పుకో చెప్పుకో ఉన్న మాటా
చెప్పనా చెప్పనా చిన్న మాటా
చెప్పుకో చెప్పుకో ఉన్న మాటా
కళ్ళలో మనసులో ఉన్న మాటా
కన్నులే మనసుతో చెప్పకే చెప్పుకున్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాటా
చెప్పుకో చెప్పుకో ఉన్న మాటా
నువ్వు నేను ఏకం అంట నాకు నువ్వే లోకం అంట
కళ్ళతోనే ఇల్లు కట్టనా
ఇలాగే తడబడి రానా భలేగా ముడిపడి పోనా
ఓ వెన్నెలింత వద్దకొచ్చి కన్నెపైట కానుకిచ్చి వన్నెలన్ని అప్పగించన
ఫలించే తపనల వెంటా భరించే త్వరపడమంటా
ఓ సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో
చలేసే నీరెండళ్లో కన్నె గుండెలో
చెప్పనా చెప్పనా చిన్న మాటా
చెప్పుకో చెప్పుకో ఉన్న మాటా
తేలిపోయే లేత వొళ్ళు వాలిపోయే చేప కళ్ళు ఆకతాయి చేత ఆగితే
అదేదో తెలియని హాయి ఇదంటూ తెలిసినదోయి
అరరరరె ఒద్దికైనా చోటు ఉంది సద్దు లేని చాటు ఉంది ముద్దిలిచ్చి పొద్దుపుచ్చానా
కులాసా కులుకులలోన భరోసా తెలుపగా రానా
ఓ ఎదలో సరదాలయ్యో పదాలే ఎదిగే నయ్యె
చలాకి నీ సందిట్లో ఎన్ని విందులో
చెప్పనా చెప్పనా చిన్న మాటా
చెప్పుకో చెప్పుకో ఉన్న మాటా
కళ్ళలో మనసులో ఉన్న మాటా
కన్నులే మనసుతో చెప్పకే చెప్పుకున్న మాట
చెప్పనా చెప్పనా ఉమ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
చెప్పుకో చెప్పుకో ఆహ హ హ్మ్మ్