• Song:  Vakratumda mahaakaaya
  • Lyricist:  Jonnavittula Ramalingeswara Rao
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రామాణం ధర్మ దేవతకు నిలపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ ఆ ఆ ఆ
Vakratumda mahaakaaya kotisurya samaprabhaa Nirvignam kurumedeva sarvakaaryeshu sarvadaa Jaya jaya shubhakara vinaayaka Shri kaanipaaka varasiddi vinaayaka Jaya jaya shubhakara vinaayaka Shri kaanipaaka varasiddi vinaayaka Aa aa aa aa Baahudaanadi tiramulona baavilona velasina deva Mahilo janulaku mahimalu caati ihaparamulanidu mahaanubhaavaa Ishtamainadi vadalina nikada ishtakaamyamulu tirche ganapati Karunanu kuriyucu varamula nosagucu niratamu perige mahaakruti Sakala charaachara prapamcame sannuti chese vignapati Ni gudilo chese satya praamaanam dharma devataku nilapunu praanam Vijaya kaaranam vigna naashanam kaanipaakamuna ni darshanam Jaya jaya shubhakara vinaayaka Shri kaanipaaka varasiddi vinaayaka Jaya jaya shubhakara vinaayaka Shri kaanipaaka varasiddi vinaayaka Pimdi bommavai pratibha chupi brahmaamda naayakudivainaavu Maataa pitalaku pradakshinamuto mahaa ganapatigaa maaraavu Bhaktula moralaalimchi brochutaku gajamuka ganapativainaavu Brahmaamdamu ni bojjalo daachi lambodarudavu ayinaavu Laabhamu shubhamu kirtini kurvaga lakshmi ganapativainaavu Vedapuraanamulakilashaastramulu kalalu chaatuna ni vaibhavam Vakratumdame omkaaramani vibhudulu chese nikirtanam jaya jaya shubhakara vinaayaka shrI kaanipaaka varasiddi vinaayaka jaya jaya shubhakara vinaayaka shrI kaanipaaka varasiddi vinaayaka aa aa aa aa
  • Movie:  Devullu
  • Cast:  Baby Nitya,Master Nandan
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music