• Song:  Ayyappa devaaya
  • Lyricist:  Jonnavittula Ramalingeswara Rao
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ భీర గంభీర శభరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కీ గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి జనకృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి స్వామియే శరణం అయ్యప్ప స్వాములందరు తనకు సాయమ్ము కాగా ధీమంతుడై లేచి ఆ కన్నె స్వామి పట్టబందము వీడి భక్తతటికై పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోర కీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరిషా పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానది తీరా ఎరుమేలి వాసా నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించు కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్యోతిపై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మ బందము బాపు ధర్మ శాస్త్ర కలి భీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము అజ్ఞాన తిమిరమ్ము నణుచు శుభదీపం ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు పడిమెట్లుగా మారె ఇదో అపురూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం ఓం పదములకు మ్రొక్కగా ఒక్కోక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పంపానది తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి శాంతి శాంతిః ఓం శాంతి శాంతి శాంతిః
Ayyappa devaaya namah abhaya swarupaaya namah Ayyappa devaaya namah abhaya swarupaaya namah Hari hara suputraaya namah karunaa samudraaya namah Nija bhira gambira shabhari giri shikara Gana yoga mudraaya namah Paramaanu hrudayaamtaraala sthitaanamta brahmaamdarupaaya namah Ayyappa devaaya namah abhaya swarupaaya namah Paddenimidi padimetla paikekki gudikegu Bhaktulaku edurocche bamgaaru swaami Irumudulu sprushiyimchi shubhamanuchu divimchi Janakrumdamula chere jagamelu swaami Tana bhaktulonarimchu tappulaku tadabadi Oka prakka origenaa omkaara murti Swaamiye sharanam ayyappa Swaamulamdaru tanaku saayammu kaagaa Dhimamtudai lechi aa kanne swaami Pattabamdamu vidi bhaktatatikai Parugu paruguna vacche bhuvipaiki narudai Ayyappa devaaya namah abhaya swarupaaya namah Gora kikaaranya samsaara yaatrikula Sharanu goshalu vini roju shabarishaa Paapaalu doshaalu prakshaalanamu cheyu Pampaanadi tiraa erumeli vaasaa Niyamaala maalato sugunaala metlapai Nadipimcu kanipimcu ayyappa swaami Makara samkraamti sajyotipai arudemchi Mahimalanu chupimcu manikamtha swaami Karma bamdamu baapu dharma shaastra Kali bhiti tolagimchu bhutaadhineta Ayyappa devaaya namah abhaya swarupaaya namah Aadyamta rahitamau ni vishwarupamu Agyaana timirammu nanuchu shubhadipam I naalgu dikkulu padunaalgu bhuvanaalu Padimetlugaa maare ido apurupam Amarulellaru cheya amrutaabhishekam Neraverchuko swaami nidu samkalpam OM Padamulaku mrokkagaa okkokka lokam Amduko nakshatra pushpaabhishekam Pampaanadi tira shampaala paataala paapaatma parimaarchu swaami Bhaktulanu rakshimchu swaami Sharanamayyappa sharanamayyappa Shambhu vishnu tanaya sharanamayyappa Sharanamayyappa sharanamayyappa Shambhu vishnu tanaya sharanamayyappa Swaamiye sharanamayyappa Swaamiye sharanamayyappa OM shaanti shaanti shaantih OM shaanti shaanti shaantih
  • Movie:  Devullu
  • Cast:  Baby Nitya,Master Nandan
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music