నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నాకన్ని నువ్వేలే
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది
నువ్వేమో నాకని నేనేమో నీకని
రాశాడా రాతని చేతుల్లో గీతని
నువ్వే రాకుండా ఇంత దూరం నడిచాన అంటే
ఎంటో చిత్రంగా వుందే నాలో నాకే
నువ్వే లేకుండా ఇంత కాలం బతికాను అంటే
ఏమో కలనైనా నమ్మే వీలే లేదే
ఎన్నడూ ఎరుగని నవ్వులని కన్నులు చేరని వెన్నలని
అందించావని అందిస్తా నీ తోడులో
చీకటి దాచిన వేకువని మనసుకి తెలియని వేడుకని
నువ్వొచ్చాకే చూస్తున్న కదా నీ ప్రేమలో
ఏదో తింటున్నంతే ఏదో వుంటున్నానంతే
నువ్వే ఎదురవకపోతే రోజూ ఇంతే
నాకే నే బరువయిపోయా నాలో నే కరువయిపోయా
నిన్నే కలిసుండకపోతే చావాలంతే
గాల్లో రాతలు రాసుకుని నాలో నే మాటాడుకొని
గడిపేసానని గుర్తే రాధికా ని నీడలా
నాకే తోడు దొరకదని ఒంటరితనమే నేస్తమని
అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది
నువ్వేమో నాకని నేనేమో నీకని
రాశాడా రాతని చేతుల్లో గీతని