నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్న
పండు బుజ్జి కన్నా నాన్న బంగారమ్మ్మ్
బంగారం బంగారం నీకై వేఛానే
బంగారం బంగారం నిన్నే చేరానే
నీ పలుకే వినబడుతుంటే
నా చెవులే కనులవుతుంటే
మాటలకే రూపొస్తుంటే
నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపొయాయే
బంగారం బంగారం నీకై వేచనే
బంగారం బంగారం నిన్నే చేరానే
కాయలైన కనులలోన పూలు పూచే
రట్ఠే రట్ఠే రట్ఠే రట్ఠే
భారమైన కాళ్లలోన రెక్కలొచ్చే
రట్ఠే రట్ఠే రట్ఠే రట్ఠే
రక్తం బదులు అణువుల్లోనా అమృతమేదో ప్రవహించే
దేహం నుంచి వీధుల్లోకి విద్యుతేదో ప్రసరించే
నువ్వుంటే నావెంటే కాదంటే
కాలానికే నే తాళాలు వేస్తానే
బంగారం బంగారం నీకై వేచానే
నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్న
ప్రశ్నలాంటి బ్రతుకులోనా బదులు దొరికే
రట్ఠే రట్ఠే రట్ఠే రట్ఠే
పేదలైన ఎదకు ప్రేమ నిధులు దొరికే
రట్ఠే రట్ఠే రట్ఠే రట్ఠే
ఇప్పటికిప్పుడు ఉప్పెన తెచ్చే సంతోషాలు ఎదురొచ్చే
కుప్పలుతెప్పలు స్వర్గాలుండే సామ్రాజ్యాలు కనిపించే
నువ్వుంటే నావెంటే నాకంటే
దేవుళ్ళకే నేను వరాలు ఇస్తానే
బంగారం బంగారం నీకై వేచనే
నీ పలుకే వినబడుతుంటే
నా చెవులే కనులవుతుంటే
మాటలకే రూపొస్తుంటే
నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయానే
బంగారం బంగారం నీకై వేఛానే ఒఒఒఒఒ
బంగారం బంగారం నిన్నే చేరానే