నూనుగు మీసాల పోరడు సూడు
ఎదురు సూరీడే
నా మీద నజరు ఏసిండే
రంగుల డబ్బల గుండెను ముంచి
ఎత్తుకపోయిండే
వాని గుండెల్ల దాసిండే
వాని బొమ్మ గీసీ
మాటముచ్చట సెప్పుకున్న
గాలిలో వాన్ని సేరితే సాలయ్యో
మల్లొస్తడాని బాట మీద కూసోనున్న
ఎవరన్నా జర సెప్పి పోండయ్యో
నూనుగు మీసాల పోరడు సూడు
ఎదురు సూరీడే
నా మీద నజరు ఏసిండే
రంగుల డబ్బల గుండెను ముంచి
ఎత్తుకపోయిండే
వాని గుండెల్ల దాసిండే
హా ఎండ పొద్దు ఎక్కుతాంటే
వాని నీడ నిక్కి చూస్తదే
బండి మీద కూసోనున్నా
వాని ఒళ్ళో ఉన్నట్టుంటదే
దస్తీ మెల్ల ఏసుకుంటే
సేతులేసినట్టు ఉంటదే
సెమట సుక్క జారుతుంటే
నా సెంప నిమిరినట్టు ఉంటదే
నేను కండ్లు తిరిగి సోయి తప్పుతున్న
వాని కండ్లార సూస్తుంటే సాలునంటా
వాడు నిమ్మకాయ సోడా తెస్తనంటే
తిండి తిప్పల్నే మానుకుంటా
వాడు పహిల్వాన్ లా నాకు పక్కన ఉంటే
నేను దునియాల ఏడున్నా సల్లగుంటా
దొరసానిలా వాని తోడు ఉంటా
నా పాణంలా సూసుకుంటా
సీమ సిటుకుమన్నా నువ్వు పిలిసినట్టే
ఝల్లుమంది పొల్లగా
నా కాలు నిలవకుంది పిల్లగా
జల్దీగా నువ్వొచ్చి అల్లుకోరా నన్ను
వల్ల కాదు పొల్లగా
నీ మీద గాలి మల్లి మెల్లగా ఆ ఆ ఆఆ