• Song:  Santhosham sagam balam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ఓహో ఓహో సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ఓహో ఓహో నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవచేయకు మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమా ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Santhosham sagam balam haayiga navvamma Aa sangeetham nee thodai saagave guvvamma Navve nee kallalo ledha aa jaabili Navve mungillalo roju deepaavali oho Santhosham sagam balam haayiga navvamma Aa sangeetham nee thodai saagave guvvamma Navve nee kallalo ledha aa jaabili Navve mungillalo roju deepaavali oho Ninnati needale kanupaapani aapithe Repati vaipugaa nee choopu saagadhugaa Ninnati needale kanupaapani aapithe Repati vaipugaa nee choopu saagadhugaa Chuttamalle kashtamosthe kalla neellu pettukuntu Kaallu kadigi swagathinchakuu Okka chinna navvu navvi saaganampakunda Leni poni seva cheyaku Minugurula mila mila merise dharahaasam chaalu kadha Musurukune nisi vilavilalaaduthu parugulu theeyadaa Navve nee kallalo ledha aa jaabili Navve mungillalo roju deepaavali oho Aasalu repina adiyaasalu choopina Saage jeevitham adugainaa aagadhugaa Aasalu repina adiyaasalu choopina Saage jeevitham adugainaa aagadhugaa Ninna raathri peeda kala nedu thaluchukuntu Nidra maanukogalamaa Entha manchi swapnamaina andhulone vuntu Levakunda vundagalamaa Kalalugani avi kalale ani thelisinade thelivammaa Kalathalani nee kila kilatho tharimeyave chilakammaa Navve nee kallalo ledha aa jaabili Navve mungillalo roju deepaavali oho Santhosham sagam balam haayiga navvamma Aa sangeetham nee thodai saagave guvvamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chirunavvutho
  • Cast:  Shahin,Venu Thottempudi
  • Music Director:  Mani Sharma
  • Year:  2000
  • Label:  Aditya Music