చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు
బతికుంటే సూసుకుందాం ఇప్పుడైతే బంద్ పెట్టు
ఓ హో హో హో ఓ హో
ఓ హో హో హో ఓ హో
ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
ఏ యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దామా
ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలదా
ఏ యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దామా
ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలదా
ఏ కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా
కాలం మారేదాకా ఓపికంత పట్టారా
ఓ హో హో హో ఓ హో
ఓ హో హో హో ఓ హో
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనకా రాత్రనకా సైనికులై సాగినారు
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనకా రాత్రనకా సైనికులై సాగినారు
ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా
ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా
అరె లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకం రా
నీ బతుకు సల్లగుంటే లోకానికి చలువరా
ఓ హో హో హో ఓ హో
ఓ హో హో హో ఓ హో