నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా
లేక నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నదిలాగా నీవు కదలాడుతుంటే
నీతో పాటు సాగే తీరం నేనవ్వనా
నిశిరాత్రి నీవు నెలవంక నేను
నీతోపాటు నిలిచే కాలం చాలందునా
మొగై ఎదురొచ్చి వనముగా మారావూ
కలలే నాకిచ్చి కనులను దోచావూ
ఎదలయలోన లయమయ్యాయి శృతివే నువ్వు
నా బ్రతుకే నువ్వు
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
భువిలోన గాలి బరువైన వేళా
నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా
నీలాల నింగి తెలవారకుంటే
నా జీవాన్ని నీకో దివ్వెగా అందించనా
శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా
అలలా నువ్వు రావా అలజడినవుతున్నా
దీపం నువ్వైతే నీ వెలుగు నేనవ్వాన
నీలో సగమవ్వన
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నెల నిప్పే నువ్వా
లేక నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా