పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పివైతివి
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
బట్ట మరక పడితే నువ్వు కొత్త బట్టలంటివీ
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా
ఇట్టాగున్నవయ్యో పీటారన్నయ్యో
నీది ఏదేమైనా శానా గొప్ప సావయ్యో
పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు
స్వచ్ఛమంటి నిన్నే స్వామి కోరినాడయ్య
హే పైన పటారం ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
మనుషులు మాయగాళ్ళు మచ్చలున్న కేటుగాళ్ళు
కానీ ఎవరికాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు
నాది నాది అన్న స్వార్ధమున్న సెడ్డవాళ్ళు
నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు
నాకాడ వందుంటే నా ఏంటే తిరిగేటోళ్ళు
నీకాడ వెయ్యుంటే నాపైనే మొరుగుతారు
సందంట పోతాంటే సూసి కూడా పలకనోళ్ళు
నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు
లోకమెంతో లోతయ్యా పీటరన్నయ్యా
అది తవ్వి చూడడానికే ఈ జీవితమయ్యా
తొవ్వేకొద్దీ వస్తుంటారు నిండా ముంచి పోతుంటారు
నీతో నాతో ఉండే సగం దొంగోల్లేనయ్యా
వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు
వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు
హే పైన పటారం ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
కారు బంగళాలు వేలికున్న ఉంగరాలు
ఏవీ రావంట సచ్చినాక మనవెంట
నీతో ఉన్నవాళ్ళు నిన్ను మోసి కన్నవాళ్ళు
వెళిపోతారంతా వెలిగినాక సితి మంట
మట్టి మీద నువ్ కలిసిన బంధాలన్నీ అబద్ధం
మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే చివరి ప్రపంచం
మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా
అందుకనే సెబుతున్న ఈనరాదయ్యా
బాధే లేని బెంగే లేని రేపేంటన్న సింతేలేని
సోటేదైనా ఉన్నాదంటే స్మశానమేరా అందుకే
వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు
హే పైన పటారం ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం