ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా
ఆఆ ఆ ఆఆ ఆఆఆఆఆ
ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా
హో ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా
నువ్వంటే నాకిష్టమని
నిన్నే ప్రేమిస్తున్నానని
అన్నావంటే ఏఏఏఏ
నన్నే నేను మరచిపోనా
నీలో నేను చేరుకోనా
నన్నే నేను మరచిపోనా
నీలో నేను చేరుకోనా
ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా
దేవతల్లే వచ్చి దివ్యవరములిచ్చి
నుదుటిరేఖ మార్చు నేస్తమా
మమత రంగరించి మంచి పోత పోసి
మంచు కొండ నువ్వే సుమా
దేవతల్లే వచ్చి దివ్యవరములిచ్చి
నుదుటిరేఖ మార్చు నేస్తమా
మమత రంగరించి మంచి పోత పోసి
మంచు కొండ నువ్వే సుమా
నువ్వే నా ప్రాణమవ్వగా
నీకే నా ప్రాణమివ్వనా
ఊపిరాగు వరకు
వెంట నువ్వు ఉంటే
గుండె గుడిని కానుకివ్వనా
ఓఓ ఎన్ని జన్మలైన
నువ్వు తోడు ఉంటే
అంతే చాలు నాకు ప్రియతమా
మళ్ళీ పుట్టుకంటు ఉంటే
నీకు ప్రేమ బంటునవనా
స్వర్గం అన్నదంటు ఉంటే
అది నీ గుండె వాకిలననా
ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా
సప్తవర్ణమయమై
సప్తస్వరము చిలికే
రాగాల తేనె సంద్రమా
అమ్మదనములోని
కమ్మదనము పంచే
పంచామృతాభిషేకమా
సప్తవర్ణమయమై
సప్తస్వరము చిలికే
రాగాల తేనె సంద్రమా
అమ్మదనములోని
కమ్మదనము పంచే
పంచామృతాభిషేకమా
నువ్వే నా లోకమవ్వగా
నీలోనే ఏకమవ్వనా
నువ్వు నా వసంతం
నేను నీకు సొంతం
నాకు నువ్వు నీకు నేనుగా
నువ్వే నా ప్రపంచం
నేనే నీ సమస్తం
నీకు నేను నాకు నువ్వుగా
నీ తీపి ప్రేమ గురుతై
చరితలో నేను నిలిచిపోన
నీ కాలి గోటిపైన
నేనే కవిత రాసుకోనా
ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా