చిరుగాలిలా చిగురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమ
చిరుగాలిలా చిగురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమ
నెలవంకలా నది ఒంపులా
మనసును మెత్తగ దోచిన తొలి ప్రేమ
మేఘమా ఆగవే తోడుగా సాగవే
కన్నులు రాసిన కవితలు వినిపోవే ఓఓఓ
చిరుగాలిలా చిగురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమ
సన్నజాజి పువ్వుల్లోన
కన్నెలేడి కన్నుల్లోన
చూసానే నీ రూపం
స్వాతి వాన చినుకుల్లోన
రామ చిలక పలుకుల్లోన
విన్నాలే నీ నామం
నీకోసం వేసవి కాలం
వెన్నెలగా మారింది
నీకోసం నీలాకాశం
మౌనపు చార వీడింది
ఎద కోయిల నీకై తొలి తొలి పాట
సిద్ధం చేసింది ఓఓఓ
చిరుగాలిలా చిగురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమ
కోడె వయసు కొంటెదనాలే
నీ చూపయి నిలదీసాడని
అన్నాదోయ్ నా పరువం
ఇంద్రధనస్సు వయ్యారాలే
నీ ఒడిలో పడకేశాయని
అన్నాదే రవికిరణం
నీతోనే ఉంటానంటూ
అలిగింది నా ప్రాణం
నీతోనే పుట్టిందమ్మా
ప్రేమ అనే తొలివేదం
నీ కలలకు నేనే కావళినైతే
నా బ్రతుకే ధన్యం ఓఓఓ
చిరుగాలిలా చిగురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమ
Chirugalila chigurakula
Gundenu guttuga takina o prema
Chirugalila chigurakula
Gundenu guttuga takina o prema
Nelavaṅkala nadi ompula
Manasunu mettaga dochina telipena
Meghama agave toduga sagave
Kannulu rasina kavitalu vinipove ooo
Chirugalila chigurakula
Gundenu guttuga takina o prema
Sannajaji puvvullona
Kanneledi kannullona
Chusane nee rupam
Swati vana chinukullona
Rama chilaka palukullona
Vinnale nee namam
Neekosam vesavi kalam
Vennelaga marindi
Neekosam nilakasam
Maunapu chara vidindi
Eda koyila nikai toli toli
Pata siddham chesindi ooo
Chirugalila chigurakula
Gundenu guttuga takina o prema
Kode vayasu kontedanale
Nee chupai niladisadani
Annaadoy na paruvam
Indradhanassu vayyarale
Nee odilo padakesayani
Annaade ravikiranam
Neetone untanantu
Aligindi na pranam
Neetone puttindamma
Prema ane tolivedam
Nee kalalaku nene kavalinaite
Na bratuke dhanyam ooo
Chirugalila chigurakula
Gundenu guttuga takina o prema