• Song:  Ennenno Amdaalu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికున గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
Ennenno andaalu evevo raagaalu Vese pula baanam kuse gaali gandham Poddeleni aakaasham haddeleni aanandam Ennenno andaalu evevo raagaalu Sirigala chilakalu iladigi nadachuta nyaayamaa dharmamaa Tolakari merupulu chilikina chinukulu ningilo aagunaa Chalimara gadulalo sukapadu batukulu vesave korunaa Alikuna gudisela chaluvula manasulu medalo dorukunaa Andaala medallone antadu kaaliki mannu Bangaaru pantalu pande mannuku chaaladu minnu Nirupedillu podarillu Ilalo unna harivillu Ennenno andaalu evevo raagaalu Vese pula baanam kuse gaali gandham Poddeleni aakaasham haddeleni aanandam Ennenno andaalu evevo raagaalu Jalajala padamula alajadi nadulaku vantha ne paadanaa Milamila merisina talatala taaralu ningine vidunaa Cheruvula kadupuna virisina taamara tenele puyunaa Minuguru purugula midimidi velugulu vennelai kaayunaa E gaali medallono dipamlaa ne unnaa Maa palle singaaraalu nilo nene kannaa Godaaramma paravallu Telugintamma tirunaallu Ennenno andaalu evevo raagaalu Vese pula baanam kuse gaali gandham Poddeleni aakaasham haddeleni aanandam Ennenno andaalu evevo raagaalu
  • Movie:  Chanti
  • Cast:  Meena,Venkatesh
  • Music Director:  Ilaiyaraja
  • Year:  1992
  • Label:  Aditya Music