ఎవరితో ఎవరమూ
చివరికి మిగలము
తల్లి పేగు తల్లడిల్లిన
చెల్లి కన్ను చెమ్మ గిల్లిన
గుండె చప్పుడాగిపోవుట
ఆపలేములే
నాన్నలాగా బరువు మోసిన
అన్నవయ్యి దారి వేసిన
వెళ్లిపోయే పాత్రా నీదిరా
మల్లి రావులే
మూన్నాళ్ళ జీవమే
చూస్తుంటే మాయమే
పోయేది జీవమే
చేరేది దైవమే
నువ్వు ఉన్నన్నినాళ్ళు
దీపమవ్వరా
తోటి దీపాలలోన
కాంతి నింపరా
నువ్వు లేకుంటే
కాలమాగిపోదురా
కాల గర్భాన
అంత ఒక్కటేనురా
జీవమే జీవమే
జీవమే జీవమే
జీవమే
బ్రహ్మ పూర్ణ బృహస్పూర్తి
స బ్రహ్మి పూర్వ సమాకృతి
ప్రపవ్ర గర్వ నిర్వాణవృత్తి
విశ్వశ్రేయా సమర్వతి
సువిఘ్నస్రీయ శిఖద్యుతి
విదేహగేహవః జాగృతి
మూన్నాళ్ళ జీవమే
చూస్తుంటే మాయమే
పోయేది జీవమే
చేరేది దైవమే
నువ్వు ఉన్నన్నినాళ్ళు
దీపమవ్వరా
తోటి దీపాలలోన
కాంతి నింపరా
నువ్వు లేకుంటే
కాలమాగిపోదురా
కాల గర్భాన
అంత ఒక్కటేనురా
జీవమే జీవమే
జీవమే జీవమే
జీవమే