నీతో ప్రతి క్షణం ఓహ్
ఎంతో మనోహరం ఓహ్
ఎటుగా ఏ దారిలో
ఎన్నాళ్లిలా నడిపించిన
అలుపన్నదే అనిపించదే
ఏచోట ఆగిపోనీ యాత్రలో
నడిచే ప్రతి నోటా నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట జరపాలా
ప్రతిచోట బ్రహ్మోత్సవం ఓహ్
మనవైన మజినీలు చూపే
ప్రయాణాలు బ్రహ్మోత్సవం
వరసైన మనవాళ్ళు కలిసేటి
తిరనాళ్ళు బ్రహ్మోత్సవం ఓహ్
నిత్యము మనతో మనకే రణం
ఎప్పుడు ఏదో ఓ కారణం
గెలిచి తీరాలంటే లేకుంటే
గడవదు ఏ నిమిషం
మనసు బరువు ఎక్కించే కలవరం
మరచిపోయేలా చేసే వరం
పెదవులను ఏనాడూ వదలననే
చల్లని దరహాసం
కొమ్మల్లో విరిసిన నవ్వై
కొండల్లో కురిసిన నవ్వై
మబ్బుల్లో మెరిసిన నవ్వై
కిలకిలలు పువ్వుల హారాలై
వెళ్లే దారులన్నీ స్వాగతిస్తుంటే
నడిచే ప్రతి నోటా నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట జరపాలా
ప్రతి చోట బ్రహ్మోత్సవం ఓహ్
మనవైన మజినీలు చూపే
ప్రయాణాలు బ్రహ్మోత్తాసవం
వరసైన మనవాళ్ళు కలిసేటి
తిరునాళ్ళు బ్రహ్మోత్సవం ఓహ్
ఎన్నడో వెనకటి జన్మల ఋణం
తీర్చుకోవాలి అనిపించే తనం
ఎవ్వరికీ చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే
కొత్తగా మనకే మన పరిచయం
కలగజేస్తుందే ప్రతి అనుభవం
ఎదురయే ప్రతి మలుపు
వినిపించే కధలను వింటుంటే
సరిగా గమనించమంటే
సత్యం కనిపెడతాం యిట్టె
మహ్ .భూమ్మీద మనతో పాటే
నడయాడే జనులెవ్వరు అంటే
ఏదో తీరుగా మనకయినా వాళ్ళేగా
నడిచే ప్రతి నోటా నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట జరపాలా
ప్రతి చోట బ్రహ్మోత్సవం ఓహ్
మనవైన మజినీలు చూపే
ప్రయాణాలు బ్రహ్మోత్సవం
వరసైన మనవాళ్ళు కలిసేటి
తిరునాళ్ళు బ్రహ్మోత్తాసవం ఓహ్