నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మ చెట్టుకాడా
నాయుడేమన్నాడే పిల్ల
అబ్బా ఎంత విన్తగున్నవే పిల్ల
నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మ చెట్టుకాడా
నాలుగు కోళ్లు ఇచ్చాడే నాయుడు
అబ్బా గుండె జల్లుమన్నదే పిన్ని
కరణం గారి ఇంటి కాడా
కారు మునగ చెట్టు కాడా
కాముడేమన్నాడేయ్ పిల్ల
ఓహో కాముడేమన్నాడేయ్ పిల్ల
కరణం గారి ఇంటి కాడా
కారు మునగ చెట్టు కాడా
కాసులపేరు ఇస్తన్నాడమ్మా
ఓ కాసులపేరు ఇస్తన్నాడమ్మా
మునుసాబు గారి ఇంటికాడ
ముందర ధరవజు కాడా
ఆతడేమన్నదే పిల్ల
ఓహో ఆతడేమన్నాడే పిల్ల
మునసబు గారి ఇంటికాడ
ముందర ధరవజు కాడా
ముక్కు పుడకలిస్తన్నాడమ్మా
ముక్కు పుడకలిస్తన్నాడమ్మా
ముంతన్తా కోరుపు మీద
మూడు చేమంతి పూలు
ఏ రాజు పెట్టాడే పిల్ల
అబ్బా ఎంత చక్కగున్నావే పిల్ల
చేమంతి పువ్వులు చెంగులోనా తానెత్తి
కోరి కోరి పిలిచాడే నాయుడు
అబ్బా గుండె దడ దాడి ఆడే పిన్ని
కాసులపేరు ఏసుకొని
కాలవ గట్టు ఏలుతుంటే
పాణి పట్టు పట్టాడే నాయుడు
అబ్బా గుండె జల్లుమన్నదే పిన్ని
మాయమ్మ తమ్ములు మాకు మేన మామలు
గుబ్బ గొడుగులవారు
కిర్రు చెప్పులవారు
చేతి కర్రాలవారూ
వార కన్నులవారు
వయ్యారి నడకవారు
ఎతోవనున్నారో
రవికేసుకొ పామిటేసుకో
పంచాధిలో మంచమేసుకో
వాకిట్లో దీపమెటుకో
రాకపోతే కేకేసుకొ