ఆట పాటలాడు నలుగురిలో
మాటలాడు చూడు మనసులతో
చెలిమల్లుకొని మనుషులతో
దారి పొడుగు పయనంలో
దారి చూపిన నడకలతో
ఆడి పాడి ఆడి పాడే
ఈ క్షణమన్నది నిజమే అయితే
చూడని రేపుని ఇప్పుడే కణమా
అలవాటైతే ఈ ఉత్సవమే
మది మరి మరి కోరదా మరల మరల
చూసినదేదైనా చూడనివేవైనా
చూపుకి దొరికినదే కనువిందవదా
ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా
విన్నది ఏదైనా పది పది అవదా
తెలుపుతోనీ నేను నా సంగతులేవో
తెలుసుకొని నేను నీ గుసగుసలేదో
అడగమని తెలుపమని
మనలో మనకే మనతో మనమే
ఈ క్షణమన్నది నిజమే అయితే
చూడని రేపుని ఇప్పుడే కణమా
అలవాటైతే ఈ ఉత్సవమే
మది మరి మరి కోరదా మరల మరల
వున్నది ఏదైనా వుండేదేదైనా
వుండటమొకటేలే అద్భుతమవధా
దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా
మనమై నడిచినదే సగమై అవదా
కళ్ళతోనే దాగిన కళలను యేవో
మనసు ధాటి రానానే కధలను యేవో
చూపమని చెప్పమని
మనలో మనకే మనతో మనమే
ఈ క్షణమన్నది నిజమే అయితే
చూడని రేపుని ఇప్పుడే కనమా
అలవాటైతే ఈ ఉత్సవమే
మది మరి మరి కోరదా మరల మరల