నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా
ఎందరితో కలిసున్న నేనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా
కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా
ఇప్పటికీ ఆ కలలోనే వున్నా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
ఈ జన్మంతా విడిపోదీ జంటా
అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంటా నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువునా నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా
తడి కనులతో నిను వెతికేది ఎలా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెలా పరిమలహమా
చేజారిన ఆశల తొలివరమా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా