శ్రీరస్తు శుభమస్తు కొత్త పెళ్లికూతురా కళ్యాణమస్తు
శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
మా గుండె గుడిలో ఆశల ఒడిలో జ్యోతిని వెలిగించగా
శ్రీరస్తు శుభమస్తు కొత్త పెళ్లికూతురా కళ్యాణమస్తు
ఏ పూజకేపువ్వు రుణమై పూసిందో కాలానికే తెలుసట
ఆ కాలం కనుమూస్తే కలగా చెదిరేది జీవితమొకటేనటా
సవతిగా కాకుండా చెల్లిగా నను చూసి తల్లిని చేసావుగా
ఈ పారాణి పాదాలు సేవించినగాని రుణమే తీరదుగా
ఇది కలకాలమై ఉండగా
నీ అనుబంధమే పండగా
ఇంటికి దీపం ఇల్లాలనిపించు నా ముద్దు చెల్లాయిగా
శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
ఎదిగే మరణాన్ని ఎదలో దాచేసి కథ రాసే దేవుడు
పంతాల గిరి గీసి ప్రణయాన్ని ముడివేసి మోసం చేసాడు
రాగాలు వెన్నెల్ని రాహువుతో చంపి చీకటి మిగిలించితే
ఆ వేకువలా మల్లి రేకులు వెదజల్లే రవియే పుడతాడులే
ఆ దీపంలో నీ రూపమే
ఓ పాపల్లె ఆడాలని
ఊపిరి ఉయ్యాలై ఊసుల జంపాలై ఒడిలో ఆడెనులే
శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
Srirasthu Subhamasthu Kottha Pellikoothura Kalyanamasthu
Srirasthu Subhamasthu Maa Inti Devatha Soubhagyamasthu
Maa Gunde Gudilo Aasala Odilo Jyothini Veliginchagaa
Srirasthu Subhamasthu Kottha Pellikoothura Kalyanamasthu
Ye Poojakepuvvu Runamai Poosindo Kalanike Telusata
Aa Kaalam Kanumoosthe Kalaga Chediredi Jeevithamokatenataa
Savathiga Kaakunda Chelliga Nanu Choosi Thallini Chesavugaa
Ee Paarani Paadalu Sevinchinagaani Runame Theeradugaa
Idi Kalakaalamai Undagaa
Nee Anubandhame Pandagaa
Intiki Deepam Illalanipinchu Naa Muddu Chellayigaa
Srirasthu Subhamasthu Maa Inti Devatha Soubhagyamasthu
Edhige Marananni Yedhalo Daachesi Katha Raase Devudu
Panthaala Giri Geesi Pranayanni Mudivesi Mosam Chesaadu
Raagalu Vennelni Raahuvutho Champi Cheekati Migilinchithe
Aa Vekuvala Malli Rekulu Vedajalle Raviye Pudathaadule
Aa Deepamlo Nee Roopame
O Paapalle Aadaalani
Oopiri Uyyaalai Oosula Jampalai Odilo Aadenule
Srirasthu Subhamasthu Maa Inti Devatha Soubhagyamasthu
Srirasthu Subhamasthu Maa Inti Devatha Soubhagyamasthu